1, జులై 2011, శుక్రవారం

షిర్డి సాయిబాబా మొదటసారి వచ్చిన వేళ

1995 లో ఒక రోజు భుజము పైన చాలా విభూదితో కూడిన పెద్ద జోలెతో ఒక సాధువు, సాధకుని ఆఫిసు గేటు ముందుకు వచ్చి ఓ షిర్డి సాయిబాబా క బేఠ, ఓ షిర్డి సాయిబాబా క బేఠ అని పిలుస్తున్నారు. షిర్డి సాయిబాబా పేరు విన్న సాధకుడు దక్షిన ఇవ్వటం కొరకు సాధువు వద్దకు వెళ్ళి రెండు 1 రూపాయి నాణెములు సాధువు చేతిలో పెట్టాడు. సాధువు రెండు నాణెములను తిరిగి సాధకుడు చేతిలో పెట్టి వీటిని జాగ్రత్తగా దాచుకో, నీకు మంచి జరుగుతుంది అని అన్నారు. సాధువు విభూదిని సాధకుని నుదుటి మీద పెట్టి మరికొంచెం విభూదిని ఇంటికి తీసుకుని వెళ్ళమని ఇచ్చారు. నేను షిర్డి వెళ్తున్నాను పాతికమందికి అన్నదానానికి సహయం చేయగలవా అని సాధకుడుని సాధువు అడిగారు. నా దగ్గర అంత డబ్బులు లేవు అని సాధువుకి 30 రూపాయలు సాధకుడు ఇచ్చాడు. ఈ డబ్బులు పాతికమంది భోజనానికి సరిపొతాయా అని సాధువు సాధకుడుని అడిగారు. ఆ చుట్టుప్రక్కల ఉన్న మిగతావాళ్ళు సాధువును వెళ్ళిపొమ్మని వత్తిడి తెచ్చారు. ఆ సాధువు సాధకుడుని చిరునవ్వుతో చూస్తూ వెళ్ళిపొయారు. 


సాధకుడు ఆ రోజు నుండి అప్రయత్నముగ ధ్యానము ప్రారంభించి ఈ రోజు వరకు క్రమం తప్పకుండ కొనసాగిస్తున్నాడు. సాధకుని వద్ద "భక్తుల సమస్యలకు బాబా పరిష్కారములు(మీ ప్రశ్నలు - బాబా జవాబులు)" పుస్తకం ఉంది. ఈ పుస్తకం ద్వార షిర్డి సాయిబాబా తో మట్లాడవచ్చు. మీరు ప్రశ్నని మనసులో షిర్డి సాయిబాబాకి నివేదించుకుని 1 నుండి 999 మధ్యలో మీకు స్పురించిన అంకెను "భక్తుల సమస్యలకు బాబా పరిష్కారములు(మీ ప్రశ్నలు- బాబా జవాబులు)" పుస్తకంలో చూసి జవాబును పొందాలి. 


షిర్డిసాయిబాబాని ఎప్పుడు సహాయమును అడిగిన, సాధకునికి సమాధానములు అన్నియు అడిగిన ప్రశ్నలకు సంబంధించినవి వచ్చేవి. సాధకునికి చాలాసార్లు షిర్డిసాయిబాబా జీవితచరిత్ర చదవమని సమాధానములు వచ్చినవి. సాధకుడు జీవితచరిత్ర చదువుతున్నపుడు మధ్యలో ఒక కథ సాధకుని యొక్క దృష్టిని ఆకర్షించింది. ఆ కథలో ఒక భక్తుడు షిర్డిసాయిబాబాకి ఒక రూపాయి నాణెమును దక్షిణగ వేసాడు. షిర్డిసాయిబాబా ఆ ఒక్క రూపాయిని తీసుకున్నారు అంటె దాని అర్థం ఆ భక్తుడు యొక్క అన్ని పాపాలను తీసుకున్నట్టు. ఇంకొక భక్తుడు షిర్డిసాయిబాబాకి రెండు ఒక రూపాయి నాణెములును దక్షిణగ వేసాడు. షిర్డిసాయిబాబా ఆ రెండు నాణెములును తిరిగి ఆ భక్తునకు ఇచ్చివేసారు అంటె దాని అర్థం ఆ భక్తుడు యొక్క అన్ని పాపాలను తీసుకుని తిరిగి భక్తిని మరియు వైరాగ్యమును ఆ భక్తునికి ఇచ్చినట్టు. ఈ కథ చదివిన తరువాత, సాధకుడు శరీరములో విపరీతముగ ప్రకంపనలు అనుభవించాడు. ఆ రోజు నుంచి సాధకుడు అప్రయత్నముగ ధ్యానమును ప్రారంభించాడు. ఈ అనుభవము ద్వారా ఆ వచ్చినది నిజముగ షిర్డి సాయిబాబా అని సాధకుడు తెలుసుకున్నాడు.